దువ్వూరు : మండలంలోని జొన్నవరం మెట్ట వద్ద కడప – కర్నూలు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప పట్టణానికి చెందిన దంతవైద్యురాలు గౌతమి తమ కుటుంబ సభ్యులతో మంత్రాలయంలో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జొన్నవరం మెట్ట వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు టైర్ పగిలి డివైడర్‌ను దాటుకొని వెళ్లి కడప నుంచి బేతంచర్లకు వెళుతున్న కారును ఢీకొంది. ప్రమాదంలో మంత్రాలయం నుంచి కడపకు వెళుతున్న కారులో ఒక మహిళకు రెండు కాళ్లు విరిగాయి, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పవన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కడప నుండి బేతంచర్లకు వెళుతున్న కారులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు. రెండు కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పిందని ఎస్‌ఐ పేర్కొన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని సూచించారు.


