కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 40–45 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడి కుడిచేతి ముంజేయిపై ఆంజనేయ స్వామి పచ్చ ఉంది. నలుపు రంగు షర్టు తెలుపు, ఎరుపు రంగు కలిగిన గళ్ల ఫుల్ షర్ట్, ఎరుపు, నలుపు, పసుపు రంగు కలిగిన పూల డిజైన్ లుంగీ ధరించి ఉన్నాడు. అలాగే కనుమల్లోపల్లె రైల్వే స్టేషన్ల మధ్య, గిరిజన భవన్ వెనకాల ఉన్న రైల్వే ట్రాక్‌పై మరో యువకుడు రైలు కింద పడి మృతి చెందారు. మృతుడు కడప నగరం ప్రకాశం నగర్‌కు చెందిన చింతకుంట సురేష్ (24)గా గుర్తించారు. ఇతడు కేఎస్‌ఆర్‌ఎం కాలేజీలో చదువుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కడప రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. కమలాపురం రైల్వేస్టేషన్ సమీపంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు కడప రైల్వే సీఐ 9247575624, ఎస్‌ఐ సెల్ నెం. 8500226717లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
కనుమలోపల్లె వద్ద
చింతకుంట సురేష్ మృతి
కమలాపురం సమీపంలో మృతి చెందిన వ్యక్తి


