రామయ్యకు స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్నపన తిరుమంజనం

Feb 8 2026 4:28 AM | Updated on Feb 8 2026 4:28 AM

రామయ్

రామయ్యకు స్నపన తిరుమంజనం

రామయ్యకు స్నపన తిరుమంజనం పోలీస్‌స్టేషన్‌ తనిఖీ స్వచ్ఛరథం ప్రారంభం పథకాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య ముఖ్యం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు శ్రావణ్‌ కుమార్‌, పవన్‌ కుమార్‌లు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ ఆలయ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

నందలూరు: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌ను పరిశీలించడంతో పాటు రికార్డులను పరిశీలించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాలు, ఉపాధి అవకాశాలు, క్రైం రేట్‌, యాంటీ సోషల్‌ యాక్టివిటీస్‌పై ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామ్‌నాథ్‌ హెగ్డే, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

వల్లూరు(చెన్నూరు): మండల కేంద్రమైన చెన్నూరులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత శనివారం జెండా ఊపి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యంతో ఏపీని పరిశుభ్రంగా ఉంచాలన్న ధ్యేయంతో గ్రామాల్లో ఇంటింటి నుంచి పొడి చెత్త సేకరణకు ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ప్రారంభించిందన్నారు. ఈ రథాల ద్వారా పొడి చెత్తను కిలోల రూపంలో విలువ కట్టి, 20 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మైదుకూరు: ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.చంద్రానాయక్‌ తెలిపారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఆర్‌ఎస్‌కే సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రానాయక్‌ మాట్లాడుతూ రైతు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ద్వారా రైతుల పేర్లను నమోదు చేయా లని ఆర్‌ఎస్‌కే సిబ్బందిని ఆదేశించారు. విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే పీఎంకిసాన్‌, రైతు పథకాలు వర్తించవని పేర్కొన్నారు. ప్రతి రైతు ఈనెల 15లోపు పంట నమోదు చేయించుకోవాలన్నారు. అప్పుడే క్రాప్‌ ఇన్సూరెన్స్‌, పంట నష్ట పరిహారం, వ్యవసాయ పరికరాలు, ఎరువులు సబ్సిడీపై రైతులకు వర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, మైదుకూరు, చాపాడు, దువ్వూరు, రాజుపాళెం ఏఓలు. ఏఈఓలు పాల్గొన్నారు.

రామయ్యకు  స్నపన తిరుమంజనం 1
1/3

రామయ్యకు స్నపన తిరుమంజనం

రామయ్యకు  స్నపన తిరుమంజనం 2
2/3

రామయ్యకు స్నపన తిరుమంజనం

రామయ్యకు  స్నపన తిరుమంజనం 3
3/3

రామయ్యకు స్నపన తిరుమంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement