రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా ఏటీఎల్ అనుసంధానం
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ అనుసంధానం చేస్తూ ఏపీ ఎస్‌సీఈఆర్‌టి వారు దేశంలోనే మొదటి సారిగా హ్యాండ్ బుక్స్ తయారు చేసినట్లు డిప్యూటి ఈఓ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డీఈఓ కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) స్కూళ్లపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కేంద్ర అడిట్ టీం ఏటీఎల్ స్కూళ్లను విజిట్ చేస్తాయని తెలిపారు. అందువల్ల క్యాష్ బుక్, రిజల్యూషన్ బుక్, చెక్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్ అన్ని సరిచూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ రామక్రిష్ణ, జిల్లా సైన్సు ఆఫీసర్ వేపరాల ఎబినైజర్, ఏటీఎల్ స్కూల్స్ హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ , ఏటిఎల్ ఇంచార్జు టీచర్స్ హాజరయ్యారు.


