● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు | - | Sakshi
Sakshi News home page

● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు

● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు

● కార్పొరేషన్‌ ఆస్తుల ధారాదత్తం తగదు

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగరపాలక సంస్దకు చెందిన అంబేద్కర్‌ భవన్‌, వైఎస్‌ఆర్‌ ఆడిటోరియం, నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రం, పాత మున్సిపల్‌ కార్యాలయాలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించబోమని, దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు సృష్టం చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్‌ అధ్యక్షతన ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త విధానంలో భాగంగానే పీపీపీ కింద ఇటీవల మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌కు ఇస్తోందన్నారు. ఇప్పుడు కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఆస్తులను కూడ అదే పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పజెప్పే కుట్రపన్నడం దారుణమన్నారు. ిపీపీపీ కింద ఆస్తులను అప్పగించబోమంటూ మంగళవా రం జరగనున్న కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించాలని డిమాండ్‌ చేశారు. వివిధ సంఘాల నాయకులు కారు ఆంజనేయులు, వినోద్‌, బాషా, జేవీ రమణ, షిండే భాస్కర్‌, సీపీఐఎంఎల్‌ నాయకులు ఓబయ్య, డీఎం ఓబులేసు యాదవ్‌, లోక్‌సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ, ఆప్‌ నాయకులు డాక్టర్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ నాయకుడు బండి జకరయ్య తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement