11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

11నుంచి అత్తిరాల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రాజంపేట రూరల్‌: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటయిన అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేది నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. 19వ తేది వరకు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15,16,17వ తేదీల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సబ్‌కలెక్టర్‌ భావన, తహసీల్దార్‌ పీర్‌మున్నీ, మున్సిపల్‌ కమిషనర్‌ జీ.శ్రీనివాసులు, దేవస్థాన కమిటీ చైర్మన్‌ పూల నాగమణీ, మన్నూరు సీఐ మస్తాన్‌లతో సమావేశమై సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ శివరాత్రి, 16న కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి కల్యాణం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు వైభవంగా నిర్వహించనున్నారు. 17వ తేది ఉదయం 10 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది.

15న శివరాత్రి, 16న కళ్యాణం, 17న రథోత్సవం

ముస్తాబవుతున్న ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement