భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు

భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న లూర్దుమాత మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు నవదిన పూజా ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఏడవ రోజు స్థానిక మరియాపురం నుంచి గురువులుగా అభిషిక్తులైన ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి పూజను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాదర్‌ స్వర్ణ బెర్నార్డ్‌ దివ్యబలిపూజను సమర్పించగా, వల్లూరు విచారణ ఫాదర్‌ శరత్‌ దైవ సందేశమిచ్చారు. సాతానుతో సహవాసం నరకానికి మూలమని, ఏసుక్రీస్తు సువార్త సందేశం రక్షణ మార్గమని అన్నారు. మరియమాత సన్నిధిలో విశ్వాసంతో వేడుకుంటే మనకున్న అన్ని సమస్యలు సమసిపోతాయని చెప్పారు. సెయింట్‌ మేరీస్‌ కెథిడ్రల్‌ విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్‌, ఫాదర్లు హృదయ రాజు, ఫ్రాన్సిస్‌, ధర్మయ్య, గువ్వల మనోహర్‌, పీటర్‌ , వరప్రసాద్‌ లతో పాటు తిరుణాల కమిటీ అధ్య క్షుడు గుంతమళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్‌ ,ఉపాధ్యక్షుడు లూర్ధు, ట్రెజరర్‌ నంది మండలం విజయరాజు, ఎండీ అల్ఫోన్స్‌, ఇల్లూరి జయరాజు, గొట్లూరు జ్వాన్నేష్‌, విశ్వాసులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు1
1/1

భక్తిశ్రద్ధలతో లూర్దుమాత నవదిన ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement