పీపీపీకి స్వస్తి చెప్పకపోతే ఆందోళన
కూటమి ప్రభుత్వం నగరపాలక సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తే సహించం. ప్రభుత్వం పీపీపీ ప్రతిపాదన నుంచి వైదొలగకపోతే అన్ని పార్టీలు సంఘాలతో ఆందోళనలు చేపడతాం – సీఆర్‌వీ ప్రసాద్,
జిల్లా కార్యదర్శి, హేతువాద సంఘం
కూటమికి పతనం ప్రారంభమైంది
కడపలోని విలువైన ప్రజా ఆస్తులను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ ,కార్పొరేట్లకు అప్పగించేందుకు ఈ నెల 10న జరిగే కడప మున్సి పల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం అజెండాలో పెట్టడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు స్థానిక కార్పొరేటర్లు చరమగీతం పాడాలి.
–ఎన్. వెంకట శివ, నగర కార్యదర్శి, సీపీఐ
పీపీపీకి స్వస్తి చెప్పకపోతే ఆందోళన


