లక్ష్యం చేరేనా?
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల సెస్సు వసూలు మంద కొడిగా సాగుతోంది. జిల్లాలో 2025–26 ఏడాదికి రూ. 1427.00 లక్షలు వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఫిబ్రవరి 05వ తేదీ నాటికి జిల్లాలో రూ. 1037.30 లక్షలు సెస్సు వసూలు చేశారు. ఇంకా ఈ ఏడాది 389.70 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలకు సంబంధించిన సెస్సు వసూలుకు కేవలం 54 రోజులో గడువు ఉంది. అంటే ఈ లెక్కన రోజుకు రూ. 7.21 లక్షలు వసూలు చేస్తే కాని మార్చి చివరి నాటికి లక్ష్యం పూర్తి చేయలేరు. మరి ప్రతి రోజు అన్ని మార్కెట్ కమటీలు కలిసి రూ. 7.21 లక్షల వసూలు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది. జిల్లాలో కడప, పొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, సిద్దవటం, ఎర్రగుంట్ల, రాజంపేటలలో మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశశగకు సంబంధించిన క్రయవిక్రయాలు జరుగగా మిగతా మార్కెట్ కమిటీల్లో పండ్లు ఇతర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతాయి.
కడప మందంజ...
జిల్లాలో 11 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సెస్సు వసూళ్లలో కడప ముందంజలో ఉంది. కడప మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు ఉండగా ఫిబ్రవరి 5వ తేదీ నాటికి రూ. 187.08 లక్షలు వసూలు చేసి 91.26 శాతానికి చేరుకుంది. పులివెందుల మార్కెట్ కమిటీ లక్ష్యం 108 లక్షలు కాగా ఇప్పటి వరకు 92.28 లక్షలు వసూలు చేసి జిల్లాలో 85.44 శాతంతో రెండోస్థానంలో, బద్వేల్ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలు ఉండగా ఇప్పటి వరకు 151.74 లక్షలు వసూలు చేసి 74.07 శాతంతో జిల్లాలో మూడోస్థానంలో నిలిచింది. సింహాద్రిపురం మర్కెట్ కమిటీ సెస్సు వసూళ్లలో జిల్లాలో వెనకపడింది. ిసిద్దవటం మార్కెట్‌యార్డు లక్ష్యం రూ. 28 లక్షలు కాగా ఇప్పటి వరకు 14.24 లక్షలు వసూలు చేసి 50.86 శాతంతో చివరిస్థానంలో నిలిచింది.
జిల్లాలో 21 చెక్ పోస్టులు....
జిల్లాలోని మార్కెట్ కమిటీల పరిధిలో 21 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్ కమిటీలో పసుపు, వేరుశనగ, మిగతా 10 మార్కెట్ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయి. పులివెందుల మార్కెట్ కమిటీ నుంచి బత్తాయి, అరటి, నిమ్మ వంటివి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్సు చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. ఇతర ఉత్పత్తుల ధరలో ఒక శాతం, వసూలు వరిధాన్యంపై 2 శాతం సెస్సు పసూలు చేస్తున్నారు.
ఇంకా వసూలు
చేయాల్సింది: రూ.389.70 లక్షలు
ఫిబ్రవరి 5 నాటికి వసూలు చేసింది: రూ.1037.30
లక్షలు
లక్య సాధనకు కృషి
జిల్లాలోని మార్కెట్ కమిటీలు, చెక్ పోస్టుల ద్వారా వార్షికాదాయం ఏడాదికి రూ. 1427 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. అయితే ఇప్పటివరకు 1037.30 లక్షలు వసూలు చేశాం. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాం. – మురళీ మోహన్, మార్కెటింగ్‌శాఖ ఏడీ, వైస్సార్‌జిల్లా
పడి లేస్తున్న మార్కెట్ కమిటీ సెస్సు వసూలు
గడువు సమీపిస్తున్నా వదలని అధికారుల నిర్లక్ష్యం
లక్ష్యం చేరేనా?
లక్ష్యం చేరేనా?
లక్ష్యం చేరేనా?


