భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలి
సిద్దవటం : మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంత వాతావరనంలో శ్రీ నిత్యపూజ స్వామి దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్ పరిధిలో 15వ తేదీన జరిగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం బందోబస్తు ఏర్పాట్లను రాజంపేట ఏఎస్పీ రామ్‌నాథ్ మనోజ్‌హెగ్డేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యపూజ కోనలో స్వామి దగ్గరికి భక్తులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ నిత్యపూజస్వామిని దర్శనం చేసుకోగా ఆలయ పూజారులు ఆయన్ను శాలువాతో సత్కరించి, దేవాలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, కడప స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్, సబ్ డీఎఫ్‌ఓ స్వామి వివేకానంద, రేంజర్ కళావతి, కడప స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు సదాశివయ్య, ఈదుర్‌బాషా, తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు, నిత్యపూజ స్వామి ఆలయం ఈఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్


