ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తాలి
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాల్లో ఉపాధ్యాయల సమస్యలపై గళమెత్తాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరారు. సోమవారం సాయంత్రం కడపలోని సాయిబాబా స్కూల్లో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమకాలీన విద్యారంగ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేలా శాసనమండలిలో చర్చించాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పనిభారం ఎక్కువవుతోందన్నారు. దీంతో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపాధ్యాయులకు బోధరేతర పనుల నుంచి మినహాయింపు విషయంపై చర్చించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు సజ్జల రమణారెడ్డి, వెంకటనాథరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రమేష్, ప్రేమకుమార్, సుదర్శన్‌రెడ్డి, యూటీఎఫ్ నాయకులు మహేష్‌బాబు, కృష్ణారెడ్డి, ఎజాజ్ అహ్మద్, చంద్రశేఖర్, మహబూబాషా, ఆపస్ నాయకులు కొండారెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆర్‌జేయూపీ నాయకులు నరసింహారెడ్డి, పీఆర్‌టీయూ నాయకులు శివారెడ్డి, తిరుపాల్, సుబ్బారెడ్డి, లక్ష్మినరసయ్య, మధసూదన్‌రెడ్డి, ఎస్‌టిఎప్ నాయకులు రామాంజనేయులు, ఎస్‌ఆర్‌టిఎప్ నాయకులు నాగేశ్వరావు, ఏపీటీఎఫ్ సుబ్బారెడ్డి, పెంషనర్ల సంఘ నాయకులు నాగమునిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి ఉపాధ్యాయ సంఘాల
నాయకుల వినతి


