పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన సమీక్షించారు.వంద శాతం పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా 2059 పనులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు. ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో ఎంపికై న మండలాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అదిశేషారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ మద్దయ్య, ఆయా శాఖల డివిజనల్ స్థాయి ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


