శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు మూల విరాట్‌కి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
కడప సెవెన్‌రోడ్స్: దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105 జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తోపాటు ఎస్డీసి వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతీ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖులు, ప్రత్యేక అతిధులు దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం


