రోడ్డు ప్రమాదంలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

రోడ్డు ప్రమాదంలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రొద్దుటూరులోని మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్‌ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో చాపాడు మీదుగా కడపకు వెళుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కలెక్టర్‌ కారు ముందు వెళుతున్న స్కూటీ, లారీ వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీంతో కలెక్టర్‌ కారు సైతం వేగం తగ్గించింది. దీని వెనకాలే వస్తున్న అశోక్‌ లేలాండ్‌ వాహనం(ట్రక్కు) కలెక్టర్‌ కారును వెనుకవైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుకవైపు దెబ్బతింది. కారులో ఉన్న కలెక్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈయనతోపాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement