విద్యారంగానికి కేటాయింపులు తక్కువే
పాఠశాల విద్యారంగానికి తగినంత మేర నిధులు కేటాయించకపోవడం అన్యాయం. విద్యకు జీడీపీలో మూడు శాతం బడ్జెట్ పునరాలోచించాలి. మోడల్ ప్రాథమిక విద్య వ్యవస్థకు తాజా నిధుల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయా లి. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తీర్చాలి. మన బడి, మన భవిష్యత్ కింద ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ నాణ్యత ఉండేలా మరింత బడ్జెట్ పెంచాలి. – సీపీ ప్రసాద్, ఏపీపీఎస్ హెచ్‌ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు


