కల్యాణం.. కమనీయం! | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం!

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

కల్యాణం.. కమనీయం!

కల్యాణం.. కమనీయం!

కల్యాణం.. కమనీయం!

రాయచోటి టౌన్‌: రాయచోటి రాచరాయుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా రెండవ రోజు ఉదయం 9గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదపండితులు రాచరాయ యోగీస్వామి, ప్రణవానందగిరి స్వామి వారి శిశ్యులు మఠం ఓంకార స్వామి వారి ఆచార్యత్వంలో నిర్వహించారు.

ఉదయం స్వామి వారికి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌కుమార్‌, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో గణపతి హోమం, ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి వారి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి ముత్యాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ మంటపం వేదికపై స్వామి వారి కల్యాణ క్రతువు క్రమంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement