చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకెల గారడీ చూసి నిట్టూర్చింది. ఓట్లిచ్చి దీవించినా..సీట్లతో మురిపించినా నిధుల.. నీళ్ల వాటాల్లో ‘సీమ’ చిట్టచివరే నిలిచింది. నారావారి జిమ్మిక్కుల ముందు ఉక్కు పరిశ్రమ ఓడిపోయింది. విత్త మంత్రి ఉత్త బడ్జెట్టు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకెల గారడీ చూసి నిట్టూర్చింది. ఓట్లిచ్చి దీవించినా..సీట్లతో మురిపించినా నిధుల.. నీళ్ల వాటాల్లో ‘సీమ’ చిట్టచివరే నిలిచింది. నారావారి జిమ్మిక్కుల ముందు ఉక్కు పరిశ్రమ ఓడిపోయింది. విత్త మంత్రి ఉత్త బడ్జెట్టు

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

చంద్ర

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకె

అదే వంచన!

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి సర్కార్‌ రాయలసీమ సమగ్రాభివృద్ధిని గాలికొదిలేసింది. సీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం ఉత్తి మాటేనని తేటతెల్లమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సారి బడ్జెట్‌లోనూ సీమకు, ఉమ్మడి జిల్లాకు అరకొర నిధులే దక్కాయి. ఉక్కు పరిశ్రమ ఊసే లేదు. వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్షర్‌ క్లస్టర్‌ ప్రస్తావనే రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు పునః నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. జనాభా ప్రాతిపదికన లేదా భూ విస్తీర్ణం ప్రాతిపదికన ఎటు చూసినా రాయలసీమ ప్రాంతానికీ అన్యాయం చేశారని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై సైతం సవతి తల్లి ప్రేమ చూపించారని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. 2026–27 వార్షిక బడ్జెట్‌లో చంద్రబాబు సర్కార్‌ పరనిందా–ఆత్మస్తుతి మినహా ప్రాధాన్యత లోపించందని నిపుణులు వివరిస్తున్నారు. రూ.3,32,205.33 కోట్లు బడ్జెట్‌ అంకెల గారడీ తలపిస్తోందని రాజకీయ నేతలు విమర్శించారు. దాదాపు రూ.97వేల కోట్లు లోటు బడ్జెట్‌ను ఎలా పూడుస్తారో, ఆదాయ మార్గాలు ఏమిటో తెలియజేయలేదని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగులకు వేల కోట్లు బకాయి లున్నా చెల్లింపులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదని ఉద్యోగ వర్గాలు వాపో తున్నాయి. పీఆర్సీ కమీషన్‌ నియామకం, మధ్యంతర భృతి కోసం ఎదురుచూస్తు న్న ఉద్యోగ వర్గాలకు రాష్ట్ర బడ్జెట్‌ శరాఘాతమని.. వాటి ప్రస్తావనే లేకపోవడంపై ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.

మహిళలకు...నిరుద్యోగులకు మొండిచేయి

సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన మహాశక్తి పథకం (ఆడబిడ్డ నిధి), నిరుద్యోగ భృతికి మంగళం పలికింది. 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఆ హామీ మేరకు ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే 7,06,94 మంది అర్హులుగా ఉన్నారు. ప్రతినెలా రూ.106.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే నిరుద్యోగ భృతి రూ.3వేలు అందిస్తామని ప్రకటించారు, ఆ పఽథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2.80లక్షల మందికి అందించాల్సి ఉంది. వీరికి ప్రతినెలా రూ.84కోట్లు చెల్లించాలి. 2026–27వార్షిక బడ్జెట్‌లో ఆయా పథకాలకు నిధులు కేటాయింపు ఊసే లేకపోవడం గమనార్హం. రైతులకు ఎంతో ఉపయోగకరమైన ధరల స్థిరీకరణ నిధి మమ అన్పించారు. కేవలం రూ.500కోట్లతో సరిపెట్టారు.

విప్లవాత్మక మార్పులకు మంగళం...

విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. పేద విద్యార్థులకు అత్యున్నత విద్య అందించాలనే దృష్టిలో సీబీఎస్‌ఈ టోపేల్‌, ఐబీ సిలబస్‌ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఆ పథకాన్ని సీఎం చంద్రబాబు సర్కార్‌ మంగళం పలికింది. నాడు–నేడు పథకానికి ఆర్థిక మంత్రి కేశవ్‌ ఎలాంటి నిధులు కేటాయించలేదు. పైగా సీబీఎస్‌ఈ, టోఫెల్‌, ఐబీ సిలబస్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో రద్దు చేసి ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు ప్రాధాన్యత పెంచడం కూటమి సర్కార్‌ వైఫల్య పాలనకు నిదర్శనం.

ఉక్కు పరిశ్రమ ఊసే లేదు

వైఎస్సార్‌–ఈఎంసీకి ప్రాధాన్యత నిల్‌

అన్నమయ్య ప్రాజెక్టు ప్రస్తావనే లేదు

కడప, అన్నమయ్య జిల్లాలకుప్రాధాన్యత కరువు

బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు మండిపాటు

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకె1
1/2

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకె

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకె2
2/2

చంద్రబాబు మాయాజాలానికి ‘రాయలసీమ’చిన్నబోయింది. కేశవ అంకె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement