బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

బడ్జె

బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ

అసెంబ్లీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌ చూస్తే అంతా ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమను తాము పొగుడుకోవడం, గత ప్రభుత్వం పేరుతో మా మీద నిందలు వేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ప్రజలు అధికారమిచ్చిన విషయాన్ని విస్మరించారు. గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగాకు, మిర్చి, మామిడి, జొన్న ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరను అందించలేకపోయారు. అంతా అంకెల గారడీ. వాస్తవికత ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర చరిత్రలో మూడో వంతు లోటు బడ్జెట్‌ ఉండటం ఇదే తొలిసారి.

– పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు,

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్‌

బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీయే. అన్ని అబద్ధాలు, మోసాలతో బడ్జెట్‌ను నింపేశారు. ఆడబిడ్డ నిఽధి, నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చెప్పారు.. కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. సీబీఎస్‌ఈ, టోఫెల్‌ వంటి వాటిని రద్దు చేయడం దారుణం. ధరల స్థీరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. మొత్తంగా ఈ బడ్జెట్‌ ప్రజలకు ప్రయోజనకారిగా లేదు.

–ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం

బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ 
1
1/1

బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement