ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు

లింగాల : లింగాల మండలం రామనూతనపల్లె గ్రామ సమీపంలోని శివాలయం వద్ద ఆర్టీసీ బస్సును పులివెందుల శ్రీచైతన్య హైస్కూలు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుణకణపల్లె గ్రామానికి చెందిన డేరంగుల సిద్ధమ్మ గాయపడింది. వివరాలలోకి వెళితే.. శనివారం సాయంత్రం కోమన్నూతల నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సును పులివెందుల నుంచి స్కూలు పిల్లలను గ్రామాలకు తీసుకెళుతున్న శ్రీచైతన్య హైస్కూలు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సిద్దమ్మపై బస్సులో ఉన్న స్టెప్నీ టైరు పడి రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్‌కు స్టీరింగ్‌ తగలి స్వల్ప గాయాలయ్యాయి. అయితే స్కూలు బస్సులోని పిల్లలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్కూలు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు, స్థానికులు తెలిపారు. గాయపడ్డ మహిళను వెంటనే పులివెందుల ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు1
1/1

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement