మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

కడప సెవెన్‌రోడ్స్‌: మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర బాలాజీలతో కలిసి దేవదాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శైవక్షేత్రాల్లో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ మహా శివరాత్రి పండుగ సందర్భంగా అన్ని శైవక్షేత్రాలలో పోలీసు బందోబస్తు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలు సంబంధించి జిల్లా కలెక్టర్‌.. ఎస్పీ, అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. కడప నగర కమిషనర్‌ మనోజ్‌ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు జాన్‌ ఇర్విన్‌, సాయిశ్రీ, చంద్రమోహన్‌, చిన్నయ్య కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి

కడప ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ కడప జిల్లాను వ్యర్థ రహితంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జి ల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి.. మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని పట్టణ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలను వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా పర్యావరణానికి, ప్రజలకు అసౌకర్యం, హాని లేకుండా నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశంపై జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో చర్చించినట్లు చెప్పారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement