దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు మండలపరిధిలోని దైవ క్షేత్రమైన కన్నెతీర్థం వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తగుంటపల్లె 4 రోడ్ల కూడలి సమీపంలోని మలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ తిరగక పోవడంతో అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ఘటనలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల కథనం మేరకు. సొమవారం 40 మంది భక్తులతో కలసి రైల్వే కోడూరు నుంచి బస్సు జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం అమ్మవారి అలయానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసుకోని భోజనం అనంతరం తిరిగి తాడిపత్రిలోని అలూరు వద్ద ఉన్న రంగనాథస్వామి అలయానికి వెళుతుండగా జమ్మలమడుగు మండలపరిధిలోని కొత్తగుంటపల్లె గ్రామ సమీపాన రహదారిలో న్న మలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ తిరగకపోవడంతో బస్సు అదుపు తప్పి బొల్తా పడింది. ఈ సంఘటనలో రైల్వేకోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్య, దీక్షీత్, విజయలక్ష్మీ, నరసింహ్ములు, రమణయ్య, నాగేంద్ర మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నట్లు వారు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
బస్సు బోల్తా : 9 మందికి గాయాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..


