● ఇంజినీరింగ్ శాఖ‘ఇజ్జత్’పోతోంది
ఇక ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు పూర్తయ్యాక అగ్రిమెంట్ నుంచి మొదలుకొని పనులు చేసి, బిల్లులు పెట్టేంత వరకూ ప్రతి ఒక్కరి చేతులు తడపాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్ ఓపెన్ చేయడానికి, అగ్రిమెంట్ చేయడానికి, బిల్లు పెట్టడానికి, ఆ బిల్లు ఆమోదం పొందాలంటే కమిషనర్ పేషీలో, అకౌంట్ సెక్షన్‌లో ప్రతిచోటా మామూళ్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. దాని కోంస ఫోన్లు చేసి మరీ అడుగుతున్న పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి.


