అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల తనిఖీ

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల తనిఖీ

అంగన్వాడీ, సంక్షేమ వసతి గృహాల తనిఖీ

సిద్దవటం : సిద్దవటం మండలంలోని అంగన్వాడీ, రేషన్‌షాపులు, సంక్షేమ వసతిగృహాలు తనిఖీ చేసినట్లు ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం దిగువపేట రేషన్‌షాపు తనిఖీల కోసం వెళ్లిన సమయంలో రేషన్‌ డీలర్‌షాపు మూసి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. రేషన్‌షాపుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దవటంలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతిగృహాన్ని తనిఖీ చేసిన ఆయన హాస్టల్‌లోని భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం తప్పనిసరిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట సిద్దవటం తహసీల్దార్‌ ఆకుల తిరుమలబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌లు ఉన్నారు.సిద్దవటం మండలం మాధవరం–1 పరిధిలోని వెంకటేశ్వరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం విజయ్‌ప్రతాప్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ శోభారాణి, సూపర్‌వైజర్‌ శ్రీవిద్యలు పాల్గొన్నారు.

ఒంటిమిట్టలో..

ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని జెడ్పీహెచ్‌ఎస్‌, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ చౌక దుకాణాలు 1,2ను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయప్రతాప్‌ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఒంటిమిట్ట జెడ్పీహెచ్‌ఎస్‌ కు వెళ్లిన ఆయన విద్యార్థులతో మాట్లాడి, మధ్యాహ్న భోజనంలోని లోటు పాట్లను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఎంఈవో–2 డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య, తునీకల సీఐ రమేష్‌ రెడ్డి, సివిల్‌ సప్‌లై డిపూటీ తహసీల్దార్‌ సౌజన్య, అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ సుగుణ, ఒంటిమిట్ట ఆర్‌ఐ భాస్కర్‌ రెడ్డి, జెడ్పీహెచ్‌ఎస్‌ ఇంచార్జి హెచ్‌ఎం రవీంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement