కడప–బెంగళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కడప–బెంగళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

కడప–బెంగళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

కడప–బెంగళూరు రైల్వే పనులకు కేంద్రమే నిధులు ఇవ్వాలి

కడప సెవెన్‌రోడ్స్‌: కడప–బెంగుళూరు రైల్వే మార్గం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులను ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఈ అంశంపై లోక్‌సభలో మాట్లాడుతూ 2010లో ఈ రైల్వేలైన్‌ పనులను రూ. 2700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని తెలిపారు. నేటికీ 10 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పరిపూర్తికి కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తన వాటాగా ఇవ్వాల్సిన 50 శాతం నిధులను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తెలిపారు. కేంద్రమే వంద శాతం నిధులను విడుదల చేసి రైల్వే లైన్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఏపీ విభజన చట్టం 2014లో హామీ ఇచ్చిన విధంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ ప్రాజెక్టులకు ప్రాణప్రదమైందన్నారు. కేంద్ర బృందం రీ విజిట్‌ నిర్వహించి ఈ పథకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ రాలేదని చెప్పారు.

‘సీమ’ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలి

కడప స్టీల్‌ ప్లాంటు నిర్మించాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement