కడప ఉక్కు కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు? | - | Sakshi
Sakshi News home page

కడప ఉక్కు కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు?

Feb 10 2026 7:31 AM | Updated on Feb 10 2026 7:31 AM

కడప ఉక్కు కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు?

కడప ఉక్కు కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూపులు?

పులివెందుల : రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని, అలాగే కడప – బెంగళూరు రైల్వే లైన్లపై పాలకులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రతిఘటించేదుకు విద్యార్థులు, యువత, ప్రజలు సిద్ధం కావాలని ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్‌, ఆర్‌ఎస్‌ ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వంశీ, ఉపాధ్యక్షులు బాలు, సాయి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని స్థానిక శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఈనెల 11, 12, 13వ తేదీల్లో జరిగే బైకు జాతకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎఫ్‌ రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బైకు జాత జమ్మలమడుగులో ప్రారంభమై కన్యతీర్థం నుంచి ముద్దనూరు, తొండూరు మీదుగా పులివెందుల మెడికల్‌ కళాశాల, కడప – బెంగళూరు రైల్వే లైన్‌ ఆగిన పెండ్లిమర్రి వరకు ఉంటుందన్నారు. అనంతరం కడపలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ, కడప – బెంగళూరు రైల్వే లైన్‌, పులివెందుల మెడికల్‌ కళాశాల ప్రైవేట్‌పరం చేయడం ఆపాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కీలకమైందన్నారు. ఇది పూర్తయితే 10వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా, దీనికి అనుబంధంగా ఇంకా వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కానీ ఈ ప్రాంత ప్రజలపై ప్రభుత్వాలా నిర్లక్ష్యం వల్ల పరిశ్రమ శిలాఫలాకానికే పరిమితమైందన్నారు. అదేవిధంగా కడప – బెంగళూరు రైల్వే లైన్‌ కూడా రూ.2700 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తిచేయాలని 2008 లో ఐదు ఏళ్లకు పూర్తి చేయాలని శిలాఫకం వేశారని, ఇప్పటికి రూ.358 కోట్లు ఖర్చు చేసి పెండ్లిమర్రి వరకు రెల్వే లైన్‌ పూర్తి చేశారన్నారు. రాయచోటి, మదనపల్లి ప్రాంతాల్లో భూసేకరణ కూడా జరిగిందని, ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రైల్వే లైన్‌ నిరూపయోగంగా ఉందన్నారు.

అదేవిధంగా వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు మరొక వరం పులివెందుల మెడికల్‌ కళాశాల అని, దీనిల్ల ఈ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను పూర్తి చేసుకోవచ్చునని, వైద్యం కూడా పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గరవుతుందన్నారు. కానీ ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్‌పరం చేస్తే వైద్య విద్య, వైద్యం ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలోకి వెళుతుందని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు నష్టమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఓబులేసు యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement