జాతరకు వచ్చే మార్గాలు.. | - | Sakshi
Sakshi News home page

జాతరకు వచ్చే మార్గాలు..

Feb 16 2026 7:35 AM | Updated on Feb 16 2026 7:35 AM

జాతరకు వచ్చే మార్గాలు..

జాతరకు వచ్చే మార్గాలు..

గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి భక్తులు చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా మూడు రహదారుల్లో భక్తులు రావొచ్చు. కడప నుంచి రామాపురం మీదుగా చేరుకోవచ్చు. రాయచోటి–కడప జాతీయ రహదారిలో ఉన్న చిట్లూరుకు పడమర వైపు నుంచి రావచ్చు. లక్కిరెడ్డిపల్లి–రాయచోటి మార్గంలోని మర్రిచెట్టు నుంచి తూర్పు వైపున ఉండే రోడ్డు నుంచి, లక్కిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఎదురుగా ఉన్న రోడ్డు నుండి గద్దగుండ్లరాచపల్లి, ఈడిగపల్లి, కౌటపల్లి మార్గాలు ద్వారా గంగమ్మ జాతరకు భక్తులు చేరుకోవచ్చు.

తిరునాల కార్యక్రమాలు..

ఈనెల 17వ తేదీ చాగలగుట్టపల్లిలో అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల అమ్మవారికి సిద్దులపూజ, సర్వదర్శనం, బోనాలు, చాందినీ బండ్లు, అమ్మవారి ఊరేగింపు,19న గురువారం మైల తిరునాల ఊరేగింపుతో, గంగ స్నానాలతో అభిషేకంతో తిరునాల ముగుస్తుంది. 18వ తేదీ రాత్రి చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌ వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement