వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాలలో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్పార్‌సీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఇందిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(కమలాపురం), విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా గొడ్లవీటి సుబ్రమణ్యం(మైదుకూరు), జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పి. మహేశ్వర్‌రెడ్డి, జిల్లా వలంటీర్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కె. బయక్రిష్ణారెడ్డి, జిలాల మున్సిపల్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా షేక్ మహ్మద్ వారిష్, జిల్లా రైతు విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎల్. వెంకట సుబ్బారెడ్డి(కమలాపురం)లను నియమించారు.
బద్వేల్ నియోజకవర్గ
పరిశీలకుడిగా మల్లికార్జునరెడ్డి
వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులుగా ఉన్న అబ్బిగారి మల్లికార్జునరెడ్డిని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఈయన గతంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా పనిచేశారు.
మదనపల్లె సిటీ: శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాఽధికార సంస్థ నిర్వహించే జిల్లా స్థాయి చెస్ బాల,బాలికల జట్ల ఎంపికలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు డిఎస్‌డీఏ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీలు మదనపల్లెలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అండర్–13,15,17,19 జట్ల ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న జట్లు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్‌ల్లో పాల్గొంటాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ఫిబ్రవరి 21,22 తేదీల్లో తిరుపతిలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు రవీంద్రనాథ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 8639957954, మస్తాన్, సీనియర్ అసిస్టెంట్ 7386901200 నంబర్లలో సంప్రదించాలన్నారు.


