విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్య

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

విద్య

విద్యార్థి ఆత్మహత్య

కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాచకొండుగురుతేజ (16) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాచకొండుచిన్నగురయ్య, గురమ్మల కుమారుడైన గురుతేజ కలసపాడులోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. గురుతేజకు కొన్నేళ్ల నుంచి చర్మవ్యాధి కారణంగా ఆసుపత్రిల్లో వైద్యం అందించినా తగ్గకపోవడంతో చదువుపై శ్రద్ధ చూడపం లేదన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేనని మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చర్మవ్యాధికి సంబంధించిన ఆయింట్‌మెంట్‌ క్రీమ్‌ను పూసు కుని చదువుకుకోవాలని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తల్లి చూడగా గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లి చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు వచ్చి కలసపాడులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వారు తెలిపారు. గురుతేజ తండ్రి చిన్నగురయ్య 14 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి గురమ్మ రోదన వర్ణనాతీతం. తల్లి గురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు కలసపాడు పోలీసులు తెలిపారు.

లారీ ఢీకొని బేల్దారి మృతి

జమ్మలమడుగు : పట్టణంలోని నేతాజినగర్‌ కాలనీకి చెందిన తలారి రామసుబ్బరాయుడు ఆలియాస్‌ బాబు(48) అనే బేల్దారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం బాబు ముద్దనూరు మండలంలో బేల్దారి పని నిమిత్తం బైక్‌లో వెళ్లాడు. సాయంత్రం వరకు పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మండల పరిధిలోని కొత్తరోడ్డు సమీపంలోకి రాగనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తృటిలో తప్పిన ప్రమాదం

గోపవరం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి భక్తులు ట్రాక్టర్‌లో మండలంలోని మల్లెంకొండకు వెళుతున్న సమయంలో శనివారం సూరేపల్లె వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భక్తులు తెలిపారు. స్థానికుల సహాయంతో ట్రాక్టర్‌ను బయటికి తీసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మల్లెంకొండకు పంపడం జరిగింది.

విద్యార్థి ఆత్మహత్య1
1/2

విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి ఆత్మహత్య2
2/2

విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement