14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

14 ను

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు

15న గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

కల్యాణంను నిర్వహించనున్న

నూతన మఠాధిపతి దంపతులు

బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవ కార్యక్రమంలో 14న ఉదయం 6 గంటలకు నామ సంకీర్తన , ఉపనిషత్‌ పారాయణం, 8 గంటలకు అభిషేకం, 12 గంటలకు వీరమాంబ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు హరికథ, రాత్రి 8 గంటలకు కలశోత్సవం, 9 గంటలకు హరికథ, 10 గంటలకు శేషవాహనోత్సవం తదితర పూజలు నిర్వహించనున్నారు. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాతం, 12 గంటలకు దీక్షాబంధనాలంకారోత్సవం, 2గంటలకు నామసంకీర్తన , భజనలు, సాయంత్రం 4 గంటలకు హరిప్రియ కర్నూల్‌ వారిచే సంగీత విభావరి, 4 గంటలకు ఉత్సవం, 6 గంటలకు స్థానిక ఆస్థాన పండితుడిచే ఉపన్యాసం, రాత్రి 9 గంటలకు పెద్దపుత్త గ్రామ ఉభయదాతలుచే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంను నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 11 గంటలకు నరనంది ఉత్సవం, 12 గంటలనుంచి జాగారణ ఉంటుంది. 16వ తేదీ సోమవారం ఉదయం నామసంకీర్తనలు, 8 గంటలకు అభిషేకం, 10 గంటలకు మోహినీ అలంకారోత్సవం, 12 గంటలకు భజనలు, రాత్రి 7గంటలకు హరికథ, 8 గంటలకు నంది ఉత్సవం చేపట్టనున్నారు. 17వ తేదీ మంగళవారం ఉదయం పారాయణం, అభిషేకం, 10 గంటలకు నిత్యహోమం, గజోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం, రాత్రి 9 గంటలకు పుష్పరథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు 1
1/1

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement