పని ఒత్తిడితోనే హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితోనే హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

పని ఒత్తిడితోనే హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం

పని ఒత్తిడితోనే హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం

– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

కడప ఎడ్యుకేషన్‌ : కడప మున్సిపల్‌ హైస్కూల్‌ (మెయిన్‌) ఇన్‌చార్జి హెచ్‌ఎంగా పని చేస్తున్న జమీనా సుందరం పని ఒత్తిడి, కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం కడపలో ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందేటట్టు ప్రభుత్వం తరఫున చూడాల్సిందిగా డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌, నగరపాలక కమిషన్‌ మనోజ్‌కుమార్‌రెడ్డిలను సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో యాప్‌ల భారం అధికమవడం కారణంగానే జమీనా సుందరం పని ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ఆమె త్వరగా కొలుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement