నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఈ నెల 17 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇప్పటికే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించారు. ఇప్పటికే అన్ని స్కూళ్లలో మోడల్ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
● ప్రీ ఫైనల్ పరీక్షలను ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఫిజికల్ సైన్సు 50, బయాలజీ 50 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు.
మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరిన ప్రశ్నపత్రాలు
పరీక్షకు గంట ముందు స్కూళ్లకు...


