మార్కెటింగ్‌శాఖ ఏడీగా మురళీమోహన్
కడప అగ్రికల్చర్: కడప మార్కెటింగ్‌శాఖ ఏడీగా మురళీమోహన్ నియమితులయ్యారు. ఈయన పల్నాడు జిల్లాలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ పదోన్నతిపై కడప ఏడీగా వచ్చారు. కాగా, ఇదివరకు అజాద్‌వల్లి ఇన్‌చార్జు ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఏడీగా మురళీమోహన్ బాధ్యతలు స్వీకరించారు.
రాజంపేట టౌన్: రాజంపేటలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9వ తేదీన అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కన్వీనర్ సి.రామ్మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: హెడ్‌మాస్టర్ అకౌంట్ టెస్టు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు వరకు నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్టు 14వ తేదీ రెండు పూటలా నిర్ణయించిన పరీక్షా కేంద్రాలలో జరుగుతుందని తెలిపారు. వివరాలకు www.bs.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అలాగే డిసెంబర్ 2015లో జరిగిన clisc పరీక్ష ఫలితాలను www.bs.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద మరో అవకాశం కల్పించారని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత తత్కాల్ ఫీజును ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చెల్లింవచ్చని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ ద్వారా మాత్రమే www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించడంతో పాటు నామినల్ రోల్స్ సమర్పించాలని సూచించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించలేక పోయిన విద్యార్థులకు మాత్రమే అ అవకాశం వర్తిస్తుందని డీఈఓ వివరించారు.
ఒంటిమిట్ట: మండల పరిధిలోని మంటపంపల్లి గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య కుమారుడు మండ్ల జగదీష్ ఈ నెల 4న సికింద్రాబాద్ లో జరిగిన ఓపెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో విజయం సాధించి, బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇతను నందలూ రులో వీఆర్‌వో కూడా విధులు నిర్వహిస్తూ, రాజంపేట బాక్సింగ్ క్లబ్ సీనియర్ స్టూడెంట్‌గా కూడా ఉన్నాడు.
కడప సెవెన్‌రోడ్స్: ఓపెన్ కేటగిరీకి సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బార్లకు గురువారం లాటరీ డ్రా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో మొత్తం ఆరు బార్లు నోటిఫై చేయగా, అందులో నాలుగు బార్లు కేటాయించారు. ప్రొద్దుటూరు స్టేషన్‌పరిధిలో నోటిఫై చేసిన మూడు బార్లలో రెండు కేటాయించారు. అదేవిధంగా ఎర్రగుంట్ల పరిధిలో నోటిఫై చేసిన రెండు బార్లు కేటాయించారు. జమ్మలమడుగు స్టేషన్ పరిధిలో ఒక బార్ నోటిఫై చేయగా, దరఖాస్తులు రానందున కేటాయించలేదు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమి షనర్ జయరాజ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీఈఓ రవికుమార్, ఏఈఎస్ వినోద్‌కుమార్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
మార్కెటింగ్‌శాఖ ఏడీగా మురళీమోహన్


