రాష్ట్రస్థాయి పోటీల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు రెండు బంగారు పతకాలను సాధించారని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పాలెం గురుమూర్తి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో సీఎస్‌ఈ చదువుతున్న శివానంద, ఈసీఈ చదువుతున్న ఈశ్వర్ యశ్వంత్ రెడ్డి తిరుపతి ఎస్‌వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన 28వ రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ చూపారని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ లీలా రాజేష్‌ను ప్రిన్సిప్‌ల, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


