సీమ ప్రజల్లో ఆందోళన
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోతే సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు వచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులతో రాయలసీమ ప్రజల్లో అభద్రత భావం నెలకొంది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల, రైతుల ప్రయోజనాలను కాపాడాలి. – ఎస్వీ.సతీష్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


