సీమ ప్రయోజనాల కోసమే చలో పోతిరెడ్డిపాడు
రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసమే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ఈ ప్రాజెక్టును నిలిపివేయడం దారుణం. రాయలసీమ జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
– రఘురామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు


