త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

త్రేత

త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ యూరియా రాక

రాజంపేట టౌన్‌: పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో బుధవారం ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుంటే త్రేతేశ్వర స్వామి బ్రహో త్సవాలను మండలంలోని హత్యరాలతో పాటు పోలి, మందరం, సీతారాంపురం పంచాయితీల పరిధిలోని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ తరహాలో జరుపుకుంటారు. కాగా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హత్యరాల గ్రామంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది.

కడప అగ్రికల్చర్‌: వైఎస్సార్‌ జిల్లాకు బుధవారం 1000 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రనాయక్‌ తెలిపారు. ఇందులో 400 మెట్రిక్‌ టన్నులను ప్రైవేట్‌డీలర్లకు, మరో 600 మెట్రిక్‌ టన్నులు మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 1
1/1

త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement