రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి

Feb 8 2026 4:29 AM | Updated on Feb 8 2026 4:29 AM

రైలు

రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందారు. వారు ఆత్మహత్యకు పాల్పడేందుకే పట్టాలపై ఉండగా రైలు ఢీకొనడంతో.. పక్కనున్న ముళ్లపొదల్లోకి ఎగిరి పడిపోయి మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి జీఆర్‌పీ కడప సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ నాగభూషణం చేరుకుని, పరిశీలించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. మృతి చెందిన వారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సిద్దవటం మండలం మాధవరం గ్రామంలోని రోడ్డు నంబర్‌ :16లో నివాసం ఉండే తల్లీకూతుళ్లు రాజురామలక్ష్మమ్మ(80), పట్టెం లక్షుమ్మ(60)గా గుర్తించారు. వీరు ఇద్దరే నివసిస్తుంటారు. అయిన వారు ఎవరూ లేరు. వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

మృతి చెందిన రాజురామలక్ష్మమ్మ, పట్టెం లక్షుమ్మ

రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి 1
1/1

రైలు కింద పడి ఇద్దరు మహిళలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement