తీవ్ర మానసిక ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

తీవ్ర మానసిక ఒత్తిడి

Feb 8 2026 4:28 AM | Updated on Feb 8 2026 4:28 AM

తీవ్ర

తీవ్ర మానసిక ఒత్తిడి

కూటమి ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల పేరుతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూ ఒక వైపు ప్రకటనలు చేస్తూనే, మరోపక్క నిరంతరం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయలేక, మరో పక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్‌లతో పాటు బోధనేతర కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నది. –మాదన విజయకుమార్‌,

యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు.

ఒత్తిడి తగ్గించాలి

ప్రభుత్వ టీచర్లు, ప్రధానోపాధ్యాయుల మీద ప్రభు త్వం ఒత్తిడిని తగ్గించాలి. బోధనకు ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమాల వల్ల టీచర్లు, ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల అనేక మంది ఉపాధ్యాయులు పాఠశాలలో, శిక్షణా కార్యక్రమాలలోనే గుండెపోటుతో మరణించారు. ఇప్పటికయినా ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తగ్గించి ప్రశాంత వాతావరణంలో బోధన కొనసాగేలా చూడాలి. – ఆదిరెడ్డి శ్యామసుందర్‌ రెడ్డి,

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

తీవ్ర మానసిక ఒత్తిడి 
1
1/1

తీవ్ర మానసిక ఒత్తిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement