అయ్యో పాపం..
● గుండెపోటుతో తండ్రి మృతి
● గతంలో కరోనాతో తల్లి మృతి
● అనాథలైన ముగ్గురు పిల్లలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డు సమీపంలోని హెచ్‌పీ గ్యాస్ గో డౌన్ వద్ద మోపూరి రాజా అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కు టుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం రాజా ఛాతి నొప్పితో బాధపడుతూ గుండె పోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు. మృతుడు రాజా భార్య ఆరేళ్ల క్రితం కరోనాతో మృతి చెందింది. రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం వారు అనాథలయ్యారు. దీంతో పిల్లలు అనాథలు కావడంతో అయ్యో పాపమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయ్యో పాపం..


