అధైర్య పడొద్దు.. తగిన గుణపాఠం చెబుదాం
చక్రాయపేట: కూటమి నేతల ఆగడాలు మితి మీరి పోతున్నాయి..మనకూ సమయం వస్తుంది అప్పుడు తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉందని, అధైర్యపడొద్దని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గడ్డంవారిపల్లె గ్రామం గొందిలో టీడీపీ నేతల దుశ్చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న మబ్బు బాలయ్య ,రామయ్య, బాబు, వెంకటరమణ,,రేపన లక్షుమయ్య, డేరంగుల ఈశ్వర య్య,వీరాంజనేయులు నాయుడులను శుక్రవారం పరామర్శించారు, ఈసందర్భంగా తమ పట్టా భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా దారి వేసిందే కాకుండా తమపైనే తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు.తాము కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఎస్‌ఐకి ఇస్తే ఆయన దాన్ని తీసుకోలేదని చెప్పారు.తమ స్థలాలను సైతం ఆక్రమించు కున్నట్లు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.అలాగే వీరాంజనేయులు నాయుడు అనుభవంలో ఉన్న భూమిలో బోరు పైపులు కోసి వేసి మోటారును బోరులో వేయడమే కాకుండా భూమిని సైతం ఆక్రమించుకున్నారని చెప్పారు.వెంకటసుబ్బారెడ్డి,యోగీశ్వరరెడ్డిల పొలం వద్ద తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టించారని ఎంపీకి వివరించారు. ఈసందర్భంగా ఆయన సంఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని చెప్పారు.ఎప్పటికీ కాలం ఒకేలా ఉండదని రానున్న కాలం మనదే నని, అప్పుడు మనం కూడా తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. అనంతరం పడకోన వంక నారవ వద్ద పైపులు వేసి తూముకుంటకు నీరు మళ్లిస్తే రైతుల పొలాలకు మేలు కలుగుతుందని మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కల్లూరు పల్లె గ్రామం ఉక్కుశిలవాండ్లపల్లెకు వెళ్లి వైఎస్‌ఆర్‌సీపీ నేత మనోహర్ నాయుడు నూతన గృహప్రవేశ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.కాట్లగంటి వారిపల్లెలో మండల గ్రాంటు కింది వేసిన తాగునీటి బోరును ప్రారంభించారు..కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి తనయుడు రోహన్ నాగిరెడ్డి, మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ,జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌సెల్ కార్యదర్శి ప్రసాద రావు,జిల్లా కార్యదర్శులు ఈశ్వరరెడ్డి,రామాంజులరెడ్డి,మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి,రైతు విభాగం కార్యదర్శి కృష్ణారెడ్డి,గడ్డంవారిపల్లె సర్పంచ్ సురేష్‌కుమార్‌రెడ్డి, రంగారెడ్డి, శివారెడ్డి,రమణారెడ్డి,ఎంపీటీసీ కిరణ్‌కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి భరోసా


