పొలతలకు తరలివచ్చిన భక్తజనం
పెండ్లిమర్రి : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం ప్రముఖమైంది. క్షేత్రానికి శనివారం జిల్లా నలుమూల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. డీఎంహెచ్ ఓ నాగరాజు, తహసీల్దార్ అనురాధ, ఎంపీడీవో జగన్‌మోహన్‌రెడ్డిలు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిఘా నేత్రంలో పొలతల క్షేత్రం
పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అంసాఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పొలతల క్షేత్రం చూట్టు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. క్షేత్రంలో అత్యాధునిక డ్రోన్ కెమెరాతో నిఘా చేపట్టారు.
నేడు శివపార్వతుల కల్యాణోత్సవం
మహశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్‌లు తెలిపారు. అనంతరం రాత్రి 10గంటలకు రథోత్సవం అక్కదేవతల గుడి వరకు ఉంటుందన్నారు.
ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు
పొలతలకు తరలివచ్చిన భక్తజనం


