పాన్ ఐఐటీ హ్యాక్‌థాన్‌లో ప్రతిభ
వేంపల్లె: జాతీయస్థాయి పాన్ ఐఐటీ హ్యాక్ థాన్‌లో ఇదుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్విజ్, డెమో సమర్పణ వంటి అంశాల్లో నిర్వహించిన ఈ హాక్ థాన్‌లో సుమారు 8000 మంది పాల్గొనగా.. మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అంశంలో ఉత్తమ 15 జట్లను ఎంపిక చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐఐటీ మద్రాస్, క్యూడ్రెంట్ సంస్థ సంయుక్తంగా ఫైనల్స్ నిర్వహించారు.
ఈ హ్యాక్ థాన్‌లో బిట్స్ పిలానీ, ఐఐటీ విద్యార్థులు పోటీ పడగా ఆర్కే వ్యాలీ జట్టు ‘ట్వైలైట్‘ పడిగల కృష్ణ కౌశిక్, కొండ్రా స్వర్ణాంజలి విజేతలుగా నిలిచారు. విజేతలకు రేబాన్ మెటా గ్లాసిస్ షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థులను డైరెక్టర్, పరిపాలన అధికారి రవికుమార్, విభాగాధిపతులు రత్నకుమారి, సుధాకర్ రెడ్డి, కోనప్ప అభినందించారు.


