బి.మఠం పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ విచారణ
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి కె.నాగరాజు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం ఆస్వస్థతకు గురైన ఓ భక్తుడిని బి.మఠం పీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది ఎవరూ లేరు. దీంతో అతడిని మైదుకూరుకు తీసుకువెళ్లేలోపు మృతి చెందాడు. ఈ వార్త సాక్షిలో ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా వైద్యాధికారే విచారణకు వచ్చారు. ఆరోజు విధులలో ఉన్నవారు ఎవరు... ఎందుకు లేరు అనేదానిపై విచారణ జరిపారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై అదికారులకు నివేదిక పంపుతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ విడిజన్ డిప్యూటీ వైద్యఅధికారి మల్లేష్, వైద్యఅధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


