పొలతలలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
పెండ్లిమర్రి: జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాలల్లో ప్రముఖమైనది పొలతల క్షేత్రం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ కృష్ణానాయక్‌లు తెలిపారు. క్షేత్రానికి వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కడప,పులివెందుల, ప్రోద్దుటూరు, రాయచోటి డిపోల నుంచి బస్సు సర్వీస్‌లను కేటాయించారన్నారు. ఉత్సవాలకు ట్రాఫిక్, అసాంఘిక కార్యాకలాపాలు, జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ చల్లని దొర, ఎస్‌ఐ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారన్నారు.ఉత్సవ ఏర్పాట్లను ఆర్డీఓ జాన్ ఇర్విన్ శుక్రవారం పర్యవేక్షించారు. శనివారం ఉదయం స్వామివారికి వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, కుంకుమార్చనలతో ఉత్సవాలు ప్రారంభవపుతాయన్నారు. ఆదివారం చండీ హోమం, పూర్ణాహూతి, రథ ప్రతిష్ట, కుంకుమార్చన అనంతరం ఉదయం 10గంటల నుంచి ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు.
పొలతలలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు


