వైభవంగా లూర్దుమాత తిరునాల | - | Sakshi
Sakshi News home page

వైభవంగా లూర్దుమాత తిరునాల

Feb 12 2026 7:28 AM | Updated on Feb 12 2026 7:28 AM

వైభవం

వైభవంగా లూర్దుమాత తిరునాల

కడప సెవెన్‌రోడ్స్‌: కరుణామయి, ప్రేమమూర్తి ఏసుక్రీస్తును ఈ లోకానికి అందించిన దయగల తల్లి లూర్దుమాత తిరునాల బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం మరియాపురంలోని పాత గుడివద్ద బిషప్‌, కడప కథోలిక పీఠాధిపతి సగినాల పాల్‌ ప్రకాశ్‌ను మరియాపురం ప్రధాన వీధుల్లో భక్తులు తేరుపై ఊరేగించారు. క్రైస్తవ భక్తిగీతాలతో బాలికలు నృత్యం చేస్తూ పీఠంపైకి సాద ర స్వాగతం పలికారు. బిషప్‌ సగినాల పాల్‌ ప్రకాశ్‌తోపాటు వివిధ విచారణకు చెందిన 30 మంది గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్‌ సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. అనంతరం బిషప్‌ ప్రసంగిస్తూ వినయం, విధేయతే మరియమాత సుగుణాలని చెప్పారు. క్రైస్తవులు కూడా వినమ్రతతో కలిగిన ప్రత్యేక శైలిని అలవర్చుకోవాలని సూచించారు. నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విజేతలకు బిషప్‌ బహుమతి ప్రదానం చేశారు. తిరునాల కమిటీ సభ్యులు బిషప్‌ను ఘనంగా సత్కరించారు. సమిష్టి దివ్య బలిపూజలో విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు సుధాకర్‌, వికర్‌ జనరల్‌ ఎండీ ప్రసాద్‌రావు, కడప డీన్‌ జోసెఫ్‌ రాజు, ప్రొక్యూరేటర్‌ సంబటూరు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరునాల సందడే సందడి

లూర్దుమాత నవదిన ఉత్సవాల ముగింపు సందర్భంగా పాత చర్చి ఆవరణలో ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు. వాలీబాల్‌ పోటీల్లో విజేతలైనవారికి అతిథులు బహుమతులు అందజేశారు. తిరునాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆ ఆవరణం సందడిగా మారింది.

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

ముగిసిన ఉత్సవాలు

వైభవంగా లూర్దుమాత తిరునాల 1
1/3

వైభవంగా లూర్దుమాత తిరునాల

వైభవంగా లూర్దుమాత తిరునాల 2
2/3

వైభవంగా లూర్దుమాత తిరునాల

వైభవంగా లూర్దుమాత తిరునాల 3
3/3

వైభవంగా లూర్దుమాత తిరునాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement