మహాశివరాత్రికి భారీ బందోబస్తు
కడప అర్బన్ : మహాశివరాత్రి పర్వ దిన నేపథ్యంలో ఈనెల 15న దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశంను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నిర్వహించారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలపై మంగళవారం మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. జిల్లాలో ప్రధానంగా కడప సబ్ డివిజన్ పరిధిలోని పొలతల, మైదుకూరు సబ్ డివిజన్ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిత్యపూజ కోన, రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్యరాల క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటూ వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి దేవాలయంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, వాటిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్‌న్స్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, రాజంపేట ఎ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఎస్‌బీ డీఎస్పీ ఎన్. సుధాకర్ , కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ యు. సదాశివయ్య, సీఐ లు చల్లని దొర, బాల మద్దిలేటి, నరసింహ రాజు, మన్నూరు సి.ఐ ప్రసాద్ బాబు, ఆర్‌ఐలు సోమశేఖర్ నాయక్, శివరాముడు, ఎస్‌ఐ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


