గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

కడప కార్పొరేషన్‌: కడప– రాయచోటి రహదారిలో గువ్వల చెరువు ఘాట్‌ వద్ద సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి 2025 డిసెంబర్‌ 17న రాసిన లేఖకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప– రాయచోటి మార్గంలో 4లేన్ల రహదారి, దాని అనుబంధ మార్గాల నిర్మాణానికి సంబంధించి పీఎంసీ సేవలు, డీపీఆర్‌ తయారీ, నిర్మాణానికి ముందు పనులు, నిర్మాణం, నిర్వహణ పర్యవేక్షణ కోసం రూ.10.95కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ పనులు 2025– 26, 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చా మని వివరించారు.

అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి రాజంపేట: తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నడపాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కోరారు. ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం డిమాండ్‌ చేశారు.

రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి లేఖకి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement