breaking news
Ananya Raj
-
27ఏళ్లకే టాలీవుడ్ హీరోయిన్ కన్నుమూత
-
ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి
7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ లాంటి హిందీ సినిమాలతో పాటు 'తగ్గేదే లే' అనే తెలుగు మూవీలోనూ నటించిన అనన్య రాజ్(27) చనిపోయింది. గత నెల 15న ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఈమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనన్య ఇన్ స్టాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?)అనన్య రాజ్ గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడినట్లు రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నందున తమ వ్యక్తిగత గోప్యతని గౌరవించాలని అభిమానులు, మీడియాని కోరారు.'ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది' అని అనన్య ఇన్ స్టాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ananya ✨ (@ananyaraj.official)


