అత్యాధునిక డ్రోన్ల కోసం రూ.1,943 కోట్ల డీల్‌  | India signs Rs 1,943 crore deal for two MQ-9B drones | Sakshi
Sakshi News home page

అత్యాధునిక డ్రోన్ల కోసం రూ.1,943 కోట్ల డీల్‌

Aug 18 2026 5:23 AM | Updated on Aug 18 2026 5:23 AM

India signs Rs 1,943 crore deal for two MQ-9B drones

న్యూఢిల్లీ: సముద్రజలాలపై నిరంతరం కన్నేసి ఉంచి వేగంగా అప్రమత్తంచేసే, అవసరమైతే దాడులు చేసే సత్తా ఉన్న అత్యాధునిక డ్రోన్‌ ‘ఎంక్యూ–9బీ సీ గార్డియన్‌’లను లీజుకు తీసుకునేందుకు భారత రక్షణ శాఖ ముందుకొచ్చింది. అమెరికా రక్షణరంగ ప్రైవేట్‌ దిగ్గజం జనరల్‌ ఆటమిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌ సంస్థతో సోమవారం భారత రక్షణ శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 

రూ.1,943 కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఎంక్యూ–9బీ సీ గార్డియన్‌ హై ఆలి్టట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరెన్స్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రెండింటిని లీజుకు తీసుకోనున్నారు. గతంలో ఇదే భారీ డ్రోన్లను భారత నావికాదళం కోసం లీజుకు తీసుకున్న నేపథ్యంలో వాటి సేవలకు మెచ్చి మళ్లీ అవే డ్రోన్లను లీజుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు డిఫెన్స్‌ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ శాఖలో సమీకరణాల విభాగ డైరెక్టర్‌ జనరల్, అదనపు కార్యదర్శుల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సీ గార్డియన్‌ డ్రోన్‌లో అత్యాధునిక నిఘా, దాడి వ్యవస్థలు, సెన్సార్లు అమర్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement