సీఈసీ వ్యతిరేక ర్యాలీ.. ఢిల్లీలో హై అలర్ట్‌ | Police Restrictions In The Wake Of India Bloc Mps Rally | Sakshi
Sakshi News home page

సీఈసీ వ్యతిరేక ర్యాలీ.. ఢిల్లీలో హై అలర్ట్‌

Oct 6 2026 8:57 AM | Updated on Oct 6 2026 9:11 AM

Police Restrictions In The Wake Of India Bloc Mps Rally

ఢిల్లీ: ఇండియా బ్లాక్ ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు చేపట్టనున్న ర్యాలీ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలను నియంత్రిస్తున్నారు. జంతర్‌మంతర్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ర్యాలీ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. గత నిరసనల సమయంలోనూ జంతర్‌మంతర్‌, పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేంద్ర ఢిల్లీలో మొబైల్ డేటా పనిచేయకపోవడంతో ప్రజలు, మీడియా ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, కేంద్ర ఢిల్లీలోని పలు ప్రధాన రహదారులను బ్యారికేడ్లతో మూసివేసి, వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు. జంతర్‌మంతర్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, జనపథ్‌ తదితర ప్రాంతాల్లో బహుళస్థాయి బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిరసనకారులు నిర్ణీత ప్రాంతాలకు చేరకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

నిరసనలను కవర్‌ చేసే జర్నలిస్టులకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మీడియా ప్రతినిధులు పీఐబీ, డీఐపీ అక్రిడిటేషన్‌ కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, దాన్ని స్పష్టంగా కనిపించేలా ధరించాలని సూచించారు. దూరం నుంచి నిరసనలు కవర్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: ‘దోమలుకండి.. బొద్దింకలు కాదు’.. పోస్టర్ల హల్‌చల్‌!
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement